భారత ఈక్వెస్ట్రియన్ జట్టుకు కాంస్యం

by Disha Web Desk 16 |
భారత ఈక్వెస్ట్రియన్ జట్టుకు కాంస్యం
X

న్యూఢిల్లీ: జోర్డాన్‌లోని వాడిరమ్ వేదికగా జరిగిన ఉమెన్స్ ఇంటర్నేషనల్ టెన్ట్ పెగ్గింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆదివారం భారత ఈక్వెస్ట్రియన్ జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. ఈ చాంపియన్‌షిప్ పోటీల్లో మొత్తంగా 14 దేశాలు పోటీ పడ్డాయి. భారత జట్టు ఆరంగేట్రంలోనే చరిత్ర సృష్టించింది. 136 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాగి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

దక్షిణాఫ్రికా 170.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. రెండో స్థానంలో ఒమన్ 146 పాయింట్లతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. భారత ఈక్వెస్ట్రియన్ జట్టులో రితికా దహియా (కెప్టెన్), ప్రియాంక భరద్వాజ్, ఖుషీ సింగ్ ఉన్నారు. మొదటి రోజు జరిగిన పోటీల్లో భారత్ ఏడవ స్థానంలో ఉండగా.. రెండో రోజు జరిగిన పోటీల్లో 24 పాయింట్ల తేడాతో నాలుగో స్థానానికి చేరుకుంది. మూడో రోజు జరిగిన రింగ్, పెగ్, సోర్డ్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచింది. ఒవరాల్‌గా 136 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుని రికార్డు సృష్టించింది.



Next Story