- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ind vs Pak : పాక్‌ను మళ్లీ చిత్తు చేసిన టీమిండియా.. సూర్య సేన గ్రాండ్ విక్టరీ
ఆసియా కప్‌లో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. సూపర్-4 రౌండ్‌లో శుభారంభం చేసింది. పాకిస్తాన్‌ను మరోసారి చిత్తు చేసింది. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సూర్య సేన 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. ఓపెనర్ ఫర్హాన్(58) హాఫ్ సెంచరీకితోడు డెత్ ఓవర్లలో నవాజ్(21), సల్మాన్ అఘా(17 నాటౌట్), ఫహీమ్ ఆష్రఫ్(20 నాటౌట్) విలువైన పరుగులు జోడించడంతో పాక్ జట్టు.. భారత్ ముందు 172 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టింది. కానీ, ఆ లక్ష్యాన్ని టీమిండియా మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(74) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికితోడు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(47) కూడా సత్తాచాటాడు. ఇక, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(30 నాటౌట్) మిగతా పని పూర్తి చేసి భారత్ విజయాన్ని లాంఛనం చేశాడు.






