Asia Cup 2025: సూప‌ర్ 4 కు ముందు టీమిండియాకు బిగ్ షాక్‌..బుమ్రా ఔట్ ?

by velandi.Saikiran |

ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రాను ప‌క్క‌కు పెట్టాల‌ని గౌత‌మ్ గంభీర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది

Asia Cup 2025: సూప‌ర్ 4 కు ముందు టీమిండియాకు బిగ్ షాక్‌..బుమ్రా ఔట్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా క‌ప్ సూప‌ర్ 4 నేప‌థ్యంలో టీమిండియాలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రాను ప‌క్క‌కు పెట్టాల‌ని గౌత‌మ్ గంభీర్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా లీగ్ దశలో మరో మ్యాచ్ టీమిండియా ఆడాల్సి ఉంది. ఇప్పటికే సూపర్ 4 కు చేరుకున్న టీమిండియా... ఒమాన్ జట్టుతో ఆడనుంది. ఈ నెల 19వ తేదీన అంటే శుక్రవారం రోజు... అబుదాబి వేదికగా టీమిండియా వర్సెస్ ఒమాన్ జట్ల మధ్య ఫైట్ జరగనుంది.

అయితే ఈ నామ మాత్రపు మ్యాచ్ నేపథ్యంలో... బుమ్రా కు రెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. బుమ్రాను ప‌క్క‌కు పెట్టి... ఆర్శ‌దీప్ సింగ్ లేదా హ‌ర్షిత్ రాణాను తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం అందుతోంది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం.. హ‌ర్షిత్ రాణాను తీసుకునే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. గంభీర్ ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ట‌. కాగా.... ఆదివారం రోజున పాకిస్థాన్ ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది టీమిండియా.

Next Story