ప్రతిష్టాత్మక టోర్నీకి సింధు దూరం.. కారణం ఏంటంటే?

by Dishanational3 |
ప్రతిష్టాత్మక టోర్నీకి సింధు దూరం.. కారణం ఏంటంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ ఉబెర్ కప్‌కు స్టార్ షట్లర్ పీవీ సింధు దూరంగా ఉండనుంది. ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల ఏప్రిల్ 7 నుంచి మే 5 వరకు చైనాలో జరగబోయే ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ టోర్నీలకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురువారం భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది. 2022లో తొలిసారిగా థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ సారి టోర్నీలో అడుగుపెట్టనుంది. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన 10 మందితో జట్టును ఎంపిక చేశారు.

సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్‌లతోపాటు యువకులైన ప్రియాన్ష్ రజావత్, కిరణ్ జార్జ్‌లకు చోటు దక్కింది. డబుల్స్‌లో వరల్డ్ నం.1 జంట సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీతోపాటు ధ్రువ్ కపిల-అర్జున్‌ జంట ఎంపికైంది. బ్యాకప్ ప్లేయర్‌గా సాయి ప్రతీక్‌‌కు చోటు దక్కింది. ఇక, ఉబెర్‌ కప్‌‌కు సింధుతోపాటు స్టార్ డబుల్స్ ప్లేయర్లు అందుబాటులో ఉండకపోవడంతో జట్టు పూర్తిగా యువ క్రీడాకారిణులతో నిండి ఉన్నది. అన్మోల్ ఖర్బ్, తన్వీ శర్మ, అష్మిత, ఇషారాణి సింగిల్స్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే, డబుల్స్‌లో శ్రుతి, ప్రియ, సిమ్రాన్, రితిక‌లకు చోటు దక్కింది. స్టార్ డబుల్స్ ప్లేయర్లు తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప, గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ పలు కారణాలతో టోర్నీకి దూరంగా ఉన్నారు.



Next Story

Most Viewed