రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ మాజీ టెస్టు కెప్టెన్..

by Disha Web Desk 13 |
రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ మాజీ టెస్టు కెప్టెన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్ మాజీ టెస్టు కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రెండు రోజుల క్రితం దేశవాళీ క్రికెట్‌కి రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రకటనతో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. 2009 లో స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు ఆరంగ్రేటం చేశాడు. టిమ్ పైన్.. 35 టెస్టులు, 35 వన్డేలు ఆడాగా.. టెస్టుల్లో 9 హాఫ్ సెంచరీలతో 1,534 పరుగులు చేయగా.. వన్డేల్లో 1 సెంచరీతో 890 పరుగులు చేశాడు. యాషెస్ సిరీస్ 2021 టోర్నీకి ముందు సెక్స్ ఛాట్ వివాదంలో ఇరుక్కున్నాడు.

ఆసీస్ క్రికెట్ బోర్డులో ఉన్న ఓ మహిళా ఉద్యోగితో టిమ్ పైన్ అసభ్యకర రీతిలో మెసేజ్‌లు పంపినట్టు ఆరోపణలు వచ్చాయి. సాండ్ పేపర్ బాల్ టాంపిరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా తాత్కాలిక టెస్టు సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు. సారథిగా ఆసీస్‌ను 23 మ్యాచుల్లో 11 విజయాలు అందుకున్నాడు. టిమ్ పైన్ కెప్టెన్సీలో 8 టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా, 4 మ్యాచులను డ్రా చేసుకున్నాడు.



Next Story