FIFA World Cup 2022: వెలుగులోకి సంచలన విషయాలు

by Disha Web Desk 4 |
FIFA World Cup 2022:  వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఫుట్‌బాల్ క్రీడాభిమానులను ఊర్రుతలూగిస్తూ ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతర్‌లో సాగుతోంది. ఈనేపథ్యంలో గార్డియన్ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. స్టేడియం నిర్మాణ సమయంలో 400 నుంచి 500 మంది వలస కార్మికులు మరణించినట్లు తెలిపింది. ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్ ప్రాజెక్ట్ పనుల నిమిత్తం ఇతర దేశాలకు చెందిన వలస కార్మికులను పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంది. 6500 మంది ఈ ప్రాజెక్ట్ పనుల్లో పని చేసినట్లు తెలిపింది.

పనులు జరుగుతున్న సమయంలో వలస కార్మికులు చనిపోయినట్లు తెలిపింది. తాజాగా గురువారం మరో వలస కార్మికుడు మృతి చెందారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఫిలిపినో సంస్థ ఖతర్‌లో సేఫ్టీ ఇన్వేస్టిగేషన్ ప్రారంభించిందని వలస కార్మికుల మరణాలు ఎందుకు జరిగాయన్న దానిపై నివేదిక అందజేయనున్నట్లు వెల్లడించింది. వలస కార్మికులకు ఫిఫా నివాళులర్పించింది. కాగా ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఇప్పటికే గ్రూప్, ప్రీక్వార్టర్ మ్యాచ్‌లు ముగిసాయి.

Read More....

'హిట్‌మ్యాన్ అప్పుడు దిగి ఉంటే టీమిండియా మ్యాచ్ గెలిచేది'


Next Story

Most Viewed