MS Dhoni Candy Crush : ఫ్లైట్ లో క్యాండీ క్రష్ ఆడిన ధోని.. కేవలం మూడు గంటల్లో 30 లక్షల డౌన్ లోడ్స్

by Shiva Kumar |
MS Dhoni Candy Crush : ఫ్లైట్ లో క్యాండీ క్రష్ ఆడిన ధోని.. కేవలం మూడు గంటల్లో 30 లక్షల డౌన్ లోడ్స్
X

దిశ, వెబ్ డెస్క్ : మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఐసీసీ ట్రోఫీలను అన్ని ఫార్మట్లలో భారత్ అందించిన ఘటన మాహీది. మాములుగా ధోని మొబైల్ ఫోన్ తక్కువగా వాడతాడు. ఎక్కువగా ఆన్‌ లైన్ గేమ్స్ ఆడేందుకు మాత్రమే ఇష్టపడతాడు. తాజాగా.. ఫ్లైట్‌లో ఒక ఎయిర్‌ హోస్టెస్ ధోనీకి చాక్లెట్లు ఇచ్చేందకు వెళ్లింది, అప్పుడు అతని రియాక్షన్‌ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సదరు వీడియోలో ఎయిర్‌ హోస్టెస్ ఇచ్చిన ఛాక్లెట్‌ని తీసుకున్న ధోనీ తన ట్యాబ్‌లో క్యాండీ క్రష్ ఆడుతున్నట్లు కనిపించాడు.

దీంతో చాలామంది ధోని ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ గేమ్‌ని డౌన్‌ లోడ్ చేయబోతున్నట్లుగా కామెంట్లు చేశారు. అయితే, కామెంట్లను బాగా గమనించిన ధోని వీరాభిమాని ‘క్యాండీ క్రష్ సాగా అఫిషియల్’ పేరుతో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడంతో ఆ గేమ్ కు సంబంధించి డౌన్ లోడ్లు కేవలం మూడు గంటల్లో 3.6 మిలియన్లకు పెరిగాయి. థ్యాంక్స్ టూ ఇండియన్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ. మీ వల్లే మేం ఇండియాలో ట్రెండ్ అవుతున్నాం అంటూ ట్వీట్ చేశాడు. ఆ ఫేక్ అకౌంట్ వార్త తెగ వైరల్ కాగా, దీంతో చాలా మంది మాహీ అభిమానులు, క్యాండీ క్రష్ గేమ్‌ ను డౌన్‌లోడ్ చేసుకుని, ఆ సంఖ్యను మరింత పెంచుతామని కామెంట్లు పెడుతుండడం విశేషం.

Next Story