యువతి ఆత్మహత్య

by Kalyani |
యువతి ఆత్మహత్య
X

దిశ, మేడ్చల్ టౌన్: ప్రభుత్వ కొలువు కోసం ఎన్నో కలలతో నగరానికి వచ్చిన యువతికి ఆ కల కలగానే మిగిలిపోయింది. గ్రూప్ పరీక్షలకు సిద్ధం అవుతూ తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.నల్గొండ జిల్లాలోని నకిరేకల్ కు చెందిన సంగీత(24) అనే యువతి మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ లో గత కొంతకాలంగా నివాసం ఉంటూ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతోంది.ఈ క్రమంలోనే జూన్ నెలలో పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో తీవ్ర ఒత్తిడికి గురై మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed