సీఎస్కే టాప్ బ్యాటర్ రిటైర్మెంట్ ట్వీట్.. క్లారిటీ ఇచ్చిన చెన్నై టీమ్

by Disha Web |
సీఎస్కే టాప్ బ్యాటర్ రిటైర్మెంట్ ట్వీట్.. క్లారిటీ ఇచ్చిన చెన్నై టీమ్
X

ముంబై : చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ గందరగోళానికి గురి చేసింది. ఒకవైపు రాయుడు ఐపీఎల్‌ మరో సీజన్ ఆడబోనని ట్వీట్ చేయడం కాసేపటికే ఆ ట్వీట్ తొలగించడం అభిమానులను అయోమయంలో పడేసింది. 'ఇదే నాకు చివరి టీ20 లీగ్. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ఆడబోను. ఈ మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం కల్పించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు కృతజ్ఞతలు' అని రాయుడు ట్వీట్ చేశాడు.

దాంతో రాయుడు ఐపీఎల్‌కు రాయుడు గుడ్ బై చెప్పాడని భావించే లోపే అతను ట్వీట్ డిలీట్ చేశాడు. దాంతో రాయుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. అయితే రాయుడు డిలీట్‌ చేసిన ట్వీట్‌పై సీఎస్కే సీఈవో విశ్వనాథ్ స్పందించారు. 'రాయుడితో మాట్లాడాను. అతను రిటైర్‌ అవ్వట్లేదు. ఈ సీజన్‌లో అతడు తన ఆటతీరుతో అసంతృప్తిగా ఉన్నాడు. అందువల్ల పొరబాటుగా ఆ ట్వీట్‌ చేసి ఉంటాడు. కానీ ఆ తర్వాత దాన్ని డిలీట్‌ చేశాడు. కచ్చితంగా అతడు రిటైర్‌ అవ్వట్లేదు' అని విశ్వనాథ్‌ క్లారిటీ ఇచ్చాడు. 2019లో ప్రపంచకప్‌ జట్టుకు రాయుడును ఎంపిక చేయకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు. దాంతో అతడు అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఆ తర్వాత రాయుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed