సాఫ్ట్ సిగ్నల్స్ నిబంధన రద్దు.. ఐసీసీ సంచలన నిర్ణయం

by Disha Web Desk 13 |
సాఫ్ట్ సిగ్నల్స్ నిబంధన రద్దు.. ఐసీసీ సంచలన నిర్ణయం
X

దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. క్రికెట్‌లో సాఫ్ట్ సిగ్నల్స్ నిబంధనను తొలిగించింది. ఇది ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ నుంచి అమల్లోకి రానుంది. సాఫ్ట్ సిగ్నల్ నిబంధన అంటే ఫీల్డర్ కష్టమైన క్యాచ్‌ను అందుకున్నప్పుడు బంతి అతని చేతిలో పడిందా? లేక గ్రౌండ్‌కు తాకిందా? అనేది స్పష్టంగా తెలియపోయినప్పటికీ ఫీల్డ్ అంపైర్ అవుట్ అనో లేదా నాటౌట్ అనో సిగ్నల్ ఇస్తారు. ఈ నిబంధన రద్దు చేయడంతో ఇక నుంచి అటువంటి నిర్ణయాలు ప్రకటించకూడదు. ఇక నుంచి ఎల్బీడబ్ల్యూ కానీ, రనౌట్ కానీ.. ఏ విషయంలోనైనా సందేహం ఉన్నప్పుడు సొంతంగా నిర్ణయం ప్రకటించకుండా థర్డ్ అంపైర్ సహాయం తీసుకోవాలి. టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో సరైన ఫలితాలను ఇవ్వని పాత పద్ధతులను అనుసరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.

నిజానికి పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ రూల్. ఎల్బీడబ్ల్యూల విషయంలోనూ అంపైర్స్ నిర్ణయాన్ని ఇందుకే అమలు చేస్తున్నారు. ముఖ్యంగా బౌండరీల దగ్గర పట్టే క్యాచ్‌ల విషయంలో సాఫ్ట్ సిగ్నల్ రూల్ అమలుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రనౌట్ మాదిరిగానే వీటి విషయంలోనూ ఆన్‌ఫీల్డ్ అంపైర్లు తమ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేయొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రూల్‌ను రద్దు చేస్తూ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

.Also Read..

IPL 2023: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్..



Next Story