AIFF ఎన్నికల రేసులో భూటియా

by Dishanational4 |
AIFF ఎన్నికల రేసులో భూటియా
X

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఎన్నికల్లో ప్రెసిడెంట్ పోస్టుకు మాజీ ప్లేయర్ బైచుంగ్ భూటియా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశాడు. భూటియా టీమ్‌మేట్ దీపక్ ఎన్నికల్లో పేరును ప్రతిపాదించగా.. ఎలక్టోరల్ కాలేజ్‌లో ఉన్న మధు కుమారి ఆమోదించారు. ఈ సందర్భంగా భూటియా మాట్లాడుతూ.. 'ఎమినెంట్ ప్లేయర్స్ ప్రతినిధిగా నామినేషన్ దాఖలు చేశాను. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. ఆటగాళ్లకు ఇదొక చివరి అవకాశం లాంటిది. ఆటగాళ్లగానే కాకుండా అడ్మినిస్ట్రేటర్లుగా కూడా తాము బెస్ట్ అని నిరూపించుకుంటాం.' అని పేర్కొన్నాడు. కాగా, ఈ నెల 28న ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి.


Next Story

Most Viewed