దేశవాళీలో మహిళలకూ ‘రెడ్‌ బాల్’ టోర్నీ.. ఆరేళ్ల తర్వాత నిర్వహణ‌కు బీసీసీఐ నిర్ణయం!

by Dishanational3 |
దేశవాళీలో మహిళలకూ ‘రెడ్‌ బాల్’ టోర్నీ.. ఆరేళ్ల తర్వాత నిర్వహణ‌కు బీసీసీఐ నిర్ణయం!
X

దిశ, స్పోర్ట్స్ : ఆరేళ్ల తర్వాత మహిళా క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతున్నారు. దేశవాళీ క్రికెట్‌లో మహిళల కోసం రెడ్ బాల్ టోర్నీలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ ఇంటర్ జోనల్ మల్టీ డే ట్రోఫీని నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి పుణె ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు(ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్, నార్త్-ఈస్ట్ జోన్ జట్లు) పాల్గొంటాయి. ఐదు మ్యాచ్‌లు జరగనుండగా.. ఒక్కో మ్యాచ్ మూడు రోజులపాటు జరగనుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ నేరుగా సెమీస్‌కు చేరుకుంటాయి. ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మధ్య, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య ఈ నెల 29న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో గెలిచిన జట్లులో ఏప్రిల్ 3న సెమీస్‌లో పాల్గొంటాయి. ఏప్రిల్ 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్లు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఆడుతున్నారు. మార్చి 17న ఫైనల్ జరగనుంది. ఆ తర్వాత సీనియర్ ఇంటర్ జోనల్ మల్టీ డే ట్రోఫీ మొదలుకానుంది.


Next Story