దంచికొట్టి చెన్నై బ్యాటర్లు.. సన్ రైజర్స్ ముందు భారీ స్కోర్

by Disha Web Desk 12 |
దంచికొట్టి చెన్నై బ్యాటర్లు.. సన్ రైజర్స్ ముందు భారీ స్కోర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా కీలకమైన ప్లే ఆఫ్ రేస్ మ్యాచులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. తమిళనాడులోని చపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోరు నమోదు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లు గైక్వాడ్ 98, మిచెల్ 52, దుబె 39 పరుగులతో రాణించారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు విజయం సాధించాలంటే 120 బంతుల్లో 213 పరుగులు చేయాల్సి ఉంది.



Next Story

Most Viewed