భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక..

by Disha Web Desk 13 |
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక..
X

న్యూఢిల్లీ: టీమ్ ఇండియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో బరిలోకి దిగే ఆస్ట్రేలియా జట్టు ఖరారైంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్యాట్ కమ్మిన్స్ నాయకత్వంలో 16 మంది సభ్యులతో బుధవారం జట్టును ప్రకటించింది. వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా బోర్డు బలమైన జట్టునే ఎంపిక చేసింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్లు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, పేసర్ రిచర్డ్‌సన్ తిరిగి టీమ్‌లోకి వచ్చారు.

గాయం కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరమైన స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌తోపాటు పేసర్ జోష్ హాజెల్‌వుడ్‌ వన్డే జట్టులో భాగమయ్యారు. కాగా, ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడి ఆస్ట్రేలియా 0-2తో సిరీస్‌లో వెనుబడి ఉన్నది. మరో రెండు టెస్టులు జరగాల్సి ఉండగా.. మార్చి 13వ తేదీతో టెస్టు సిరీస్ ముగియనుంది. ఆ తర్వాత మార్చి 17, 19, 22 తేదీల్లో ఆసిస్ జట్టు భారత్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఈ ఏడాది భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తున్నది.

ఆస్ట్రేలియా జట్టు:

ప్యాట్ కమ్మిన్స్(కెప్టెన్), సేన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిష్, మార్నల్ లాబుషేన్, మిచెల్ మార్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.


Next Story

Most Viewed