అరుదైన ఘనత సాధించిన అశ్విన్.. ఏకైక ఆసియా బౌలర్‌గా రికార్డు

by Dishanational3 |
అరుదైన ఘనత సాధించిన అశ్విన్.. ఏకైక ఆసియా బౌలర్‌గా రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై 100వ వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఇంగ్లాండ్‌పై 1000కిపైగా పరుగులతోపాటు 100 వికెట్లు తీసిన ఏకైక ఆసియా బౌలర్‌గా రికార్డుకెక్కాడు. బెయిర్‌స్టో‌ను అవుట్ చేయడంతో అశ్విన్ ఈ ఘనత నెలకొల్పాడు. ఇప్పటికే టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై 1000 పరుగులు పూర్తి చేసిన అతను.. బెయిర్ స్టో వికెట్‌తో 100వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌పై 1000కిపైగా పరుగులు, 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ నాలుగోవాడు. అశ్విన్ కంటే ముందు ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబెర్స్, ఆస్ట్రేలియాకు చెందిన మోంటీ నోబెల్, జార్జ్ గిఫెన్ ఉన్నారు. కాగా, 22వ ఓవర్‌లోనే బెయిర్‌ స్టోను అశ్విన్ వికెట్ల ముందు దొరకబచ్చుకున్నాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. భారత్ రివ్యూ తీసుకుని వికెట్ సాధించింది.



Next Story

Most Viewed