ఉమెన్స్ డే స్పెషల్ : వెర్సటైల్ ఫిమేల్ సెలబ్రిటీస్

by  |
ఉమెన్స్ డే స్పెషల్ : వెర్సటైల్ ఫిమేల్ సెలబ్రిటీస్
X

దిశ, సినిమా : సొసైటీ పోకడలను ఎన్ని కోణాల్లో ఆవిష్కరించినా.. అభ్యుదయవాదులు గొంతెత్తి అరిచినా.. పత్రికలు, ఛానెళ్లు వంతపాడినా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకున్నా.. ఉమెన్ ఎంపవర్‌‌మెంట్‌ విషయంలో రెవల్యూషనరీ చేంజ్‌‌ అయితే కనిపించట్లేదు. పాలిటిక్స్, బిజినెస్, ఐటీ, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర రంగాల్లో కొందరు మహిళలు విశేషంగా రాణిస్తున్నార.. ఈ దిశగా మరింత మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాగా తమకు నచ్చిన రంగాల్లో కొనసాగుతున్న మహిళలు.. కెరీర్‌లో తాము ఎదుర్కొన్న సవాళ్లు, విమర్శలనే స్టెప్పింగ్ స్టోన్స్‌గా మలచుకొని సక్సెస్ అందుకుంటున్నారు. అంతేకాదు మేల్ డామినేషన్ ఇండస్ట్రీల్లోనూ తమకంటూ సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని, ఐకానిక్‌గా నిలుస్తున్నారు. ఇలాంటి క్వాలిటీస్‌తో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫిమేల్ సెలబ్రిటీస్ విశేషాలపై ఉమెన్స్ డే స్పెషల్..

సాయిపల్లవి..

తమిళనాడులోని కోటగిరికి చెందిన సాయి పల్లవి.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’తో తెలుగు తెరకు పరిచయం. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన సాయి పల్లవి.. ఏ క్యారెక్టర్ ఎంచుకున్నా అది తన రియల్ లైఫ్ ఏమో అన్నంతలా ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తుంది. నిజానికి రియల్ లైఫ్‌లోనూ తనొక స్వత్రంత్ర భావాలు గల అమ్మాయి. తన మనసుకు నచ్చిన పాత్రలకే ఓకే చెప్పే సాయిపల్లవి.. ఈ క్రమంలో స్టార్ హీరో సరసన చాన్స్ వచ్చినా, కథ నచ్చకపోతే సున్నితంగా తిరస్కరించడం తన వ్యక్తిత్వానికి నిదర్శనం. అలా వచ్చిన సినిమాలే ‘ఎంసీఏ, పడిపడి లేచే మనసు’. పైగా గ్లామర్ పేరుతో కురచ దుస్తులు ధరించేందుకు తను దూరం. అమ్మాయిని అందంగా చూపాలంటే గ్లామర్ షో అవసరం లేదనేది ఆమె అభిప్రాయం. అది తన సినిమాల్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. లేటెస్ట్‌గా ‘లవ్ స్టోరి, విరాట పర్వం’ నుంచి రిలీజైన ‘సారంగదరియా, కోల్ కోలోయమ్మ’ పాటలకు కొత్త ఫ్లేవర్‌ యాడ్ అయ్యిందంటే.. అది తన ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్‌ మాయే. ప్రత్యేకించి ‘విరాటపర్వం’ టైటిల్ కార్డ్స్‌లో హీరో కన్నా ముందు తనకే ప్రయారిటీ ఇవ్వడం తన ప్రతిభకు తార్కాణం. ఇంకో విషయం.. ప్రస్తుత జనరేషన్ లైఫ్‌స్టైల్‌ను తూర్పారబట్టే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ కూడా సాయిపల్లవి వ్యక్తిత్వాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారంటే.. హ్యాట్సాఫ్ సాయిపల్లవి.

శ్రుతిహాసన్..

లోకనాయకుడు కమల్‌హాసన్ కూతురు శ్రుతిహాసన్ మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్. మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శ్రుతి.. 2011లో ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో పాటు బాలీవుడ్‌ మూవీస్‌ కూడా చేసింది. 16 ఏళ్లకే ‘ఎక్స్‌ట్రా మెంటల్స్’ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేసిన శ్రుతి.. ఎన్నో మ్యూజిక్ షోస్ కండక్ట్ చేసింది. ఈ మేరకు కమల్ నటించిన ‘ఈనాడు’ సినిమాకు మ్యూజిక్ అందించడమే కాకుండా పలు తెలుగు, హిందీ సినిమాల్లో పాటలు కూడా పాడింది. శ్రుతి తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో ఇండిపెండెంట్‌గా, టామ్ బాయ్‌లా పెరిగిన తను.. ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంటుంది. ఇక పర్సనల్ లైఫ్‌లో చోటుచేసుకున్న డిస్టర్బెన్స్‌తో ఒకదశలో కెరీర్ డౌన్ ఫాల్‌ అయినా, ఏ మాత్రం అధైర్యపడలేదు. గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చి మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. మరోపక్క మ్యూజిక్ సింగిల్స్ రిలీజ్ చేస్తూ, ర్యాప్ షోలు నిర్వహిస్తూ యంగ్ జనరేషన్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.

నిత్యామీనన్..

‘అలా మొదలైంది’ చిత్రం ద్వారా ఇద్దరు ఫిమేల్ టాలెంట్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో ఒకరు డైరెక్టర్ నందిని రెడ్డి కాగా, మరొకరు ది క్యూటెస్ట్ హీరోయిన్ నిత్యామీనన్. ‘ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్’ వంటి చిత్రాల్లో తన పర్ఫార్మెన్స్‌తో అలరించిన నిత్య.. మేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో కూడా తన కోసం స్పేస్ క్రియేట్ చేసుకోగల నటిగా పేరు తెచ్చుకుంది. ‘చేసే పాత్ర చిన్నదా, పెద్దదా అన్న పట్టింపులే లేని నిత్య.. ఐదు నిమిషాల క్యామియో రోల్‌తో కూడా స్ర్కీన్‌పై ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు. అయితే తను ఎంచుకున్న పాత్రలో ఏదో మ్యాజిక్ ఉంటే తప్ప ఒప్పుకోదు. ‘గీతా గోవిందం’ అలాంటి సినిమానే. ఈ విషయంలో ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా, రెమ్యునరేషన్ ఎంతిచ్చినా, ఆఖరికి పాన్ ఇండియా స్టార్ అయినా సరే పక్కనబెట్టేసిన సందర్భాలున్నాయి. దీనిపై అనేక విమర్శలొచ్చినా తన పంథాను, వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. తను నమ్మిన మూలాలకే కట్టుబడి ఇప్పటికీ సినిమాలతో బిజీగానే ఉన్న నిత్య.. యంగ్ హీరోయిన్స్‌కు రోల్ మోడల్‌గా మారింది.

స్వప్న దత్ – ప్రియాంక దత్..

తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్‌గా వెలుగొందిన అశ్వనీదత్ సిన్నీ జర్నీ గురించి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు స్టార్ హీరోలందిరితో సినిమాలు నిర్మించిన చరిత్ర ఆయనది. ఇక ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇద్దరు కూతుళ్లు ‘స్వప్న, ప్రియాంక’.. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్‌గా రాణిస్తున్నారు. మొదట తండ్రి స్థాపించిన ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్‌పై కోప్రొడ్యూసర్స్‌గా కెరీర్ మొదలు పెట్టిన వీరిద్దరూ.. 2014లో ‘స్వప్న సినిమా’ పేరుతో మరో బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. అంతకుముందు ‘త్రీ ఏంజల్స్’ స్టూడియోపై వీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఆశించినమేర సక్సెస్ సాధించకపోవడంతో నష్టాలు చవిచూడక తప్పలేదు. ఈ క్రమంలో ఇండస్ట్రీ వర్గాల నుంచి అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే చివరి ప్రయత్నంగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తీసిన ‘ఎవడే సుబ్రమణ్యం’తో సక్సెస్ పలకరించింది. అదే ఉత్సాహంతో సావిత్రి బయోపిక్‌‌‌గా ‘మహానటి’ తెరకెక్కించి చరిత్ర స‌‌ృష్టించారు. ఈ క్రమంలో యంగ్ జనరేషన్ తరఫున అలనాటి మేటి నటికి గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ అందించి ప్రశంసలు అందుకున్న స్వప్న, ప్రియాంక.. అప్‌కమింగ్ ఫిమేల్ ప్రొడ్యూసర్స్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు.



Next Story

Most Viewed