గ్రామంలో హిజ్రాలతో పూజలు.. మా ఊరికి రాకండి అంటూ బోర్డులు.. అసలేమైంది ?

by  |
గ్రామంలో హిజ్రాలతో పూజలు.. మా ఊరికి రాకండి అంటూ బోర్డులు.. అసలేమైంది ?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో చాలా మంది జాగ్రత్తలు తీసుకున్నారు. పట్టణంలో కరోనా ఎక్కువగా ఉండటంతో అందరూ పట్నం విడిచి పల్లెకు వెళ్లిపోయారు. అయితే కొన్ని పల్లెటూర్లలో ఎవరు రాకుండా ఊరి పొలిమేరలో ముళ్ల కంప వేసి సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. తాజాగా మరో సారి మా ఊరికి రావద్దు అనే పదం వినబడుతోంది. మా ఊరికి ఎవరు రాకూడదంటూ ఊరి చివరన బోర్డులు పెడుతున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని సీతంపేట మండలం హద్దుబంగి పంచాయతీ పనస గూడలోని గ్రామ ప్రజలకు కొన్ని రోజుల నుంచి విష జ్వరాలతో బాధ పడుతున్నారు. దీంతో ఆ ఊరి గ్రామస్తులందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఊరు బాగుండాలని, ఊరి ప్రజలు బాగుండాలని హిజ్రాలతో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. ఈ కారణంగా మా ఊరికి ఎవరు రాకూడదంటూ ఊరి పొలిమేరల్లో బోర్డులు పెట్టారు. నాలుగు రోజులు ఎవరూ మా ఊరికి రావొద్దు.. ఊరి నుంచి కూడా ఎవరూ బయటకు వెళ్లొద్దు’ అని గ్రామస్తులు రోడ్డుపై ఏకంగా కంచె వేసేశారు. దీన్ని చూసిన వారందరూ.. కరోనా సమయంలో ప్రతి గ్రామం కంచె వేసి జాగ్రత్తలు తీసుకుంది, దీన్ని చూస్తే ఆ రోజులు గుర్తొస్తున్నాయి అంటున్నారు.

క్రికెట్‌లో వైడ్ సిగ్నల్ ఇలా కూడా ఇస్తారా.. ఇండియన్ అంపైర్ ఫన్నీ సిగ్నల్ (వీడియో)

Next Story

Most Viewed