పెళ్లి అయిన కూతుర్లకు శుభవార్త.. ఆ సంస్థలో ప్రభుత్వ ఉద్యోగం?

by  |
TBGKS1
X

దిశ, తాండూర్: సింగరేణి కార్మిక హక్కులు, రక్షణ టీబీజీకేఎస్ తోనే సాధ్యమని ఆ యూనియన్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు అన్నారు. అబ్బాపూర్ ఓసీపీలో బుధవారం నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని కరోనా రోగుల వైద్యం కోసం గత సంవత్సరం కోవిడ్ ఆస్పత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కరోనా కేసులు తగ్గడం వలన సింగరేణి కార్మికులకు వైద్యం కోసం ఏరియా ఆస్పత్రిని మళ్ళీ సింగరేణికి అప్పజెప్పాలని టీబీజీకేఎస్ సంఘం సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎంపీ వెంకటేష్, కలెక్టర్ భారతి హోళీకేరి చొరవతో ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిని మళ్లీ సింగరేణికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు.

కార్మికులకు సంబంధించిన పర్సనల్ రికార్డులలో తప్పులను సవరించాలని సింగరేణి యాజమాన్యం దృష్టికి టీబీజీ కేఎస్ తీసుకెళ్లగా, రికార్డులను సరి చేయడానికి యాజమాన్యం ఒప్పుకున్నదన్నారు. సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో పెళ్లి అయిన కార్మికుల కూతుర్లకు కూడా సింగరేణిలో ఉద్యోగం ఇప్పించేందుకు టీబీజీకేఎస్ ఎంతో కృషి చేసిందన్నారు. బొగ్గు బ్లాకుల వేలంని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 9,10,11 వ తేదీలలో సింగరేణిలో నిర్వహించ తలపెట్టిన సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ రావు, లక్ష్మయ్య, శ్రీనివాస్, రామారావు, రాజేశం, రమేష్, చంద్రయ్య, శ్రీకాంత్, కిరణ్, శ్యాంసుందర్, మల్లేష్, రాంచందర్, ప్రభాకర్, పెంటయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed