ఇండోనేషియా ఓపెన్ క్వార్టర్స్‌లో సింధు, సాయి ప్రణీత్.. శ్రీకాంత్ ఔట్

90

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ 2021 బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పీవీ సింధు వ్యోనీ లిపై 21-12, 21-18 తేడాతో ఓడించింది. సింధు శుక్రవారం సిమ్ యుజిన్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నది. పురుషుల సింగిల్స్‌లో బి. సాయిప్రణీత్ 21-17, 14-21, 21-19 తేడాతో క్రిస్టో పోపోవ్‌పై గెలిచాడు. అతను క్వార్టర్ ఫైనల్‌లో విక్టర్ అక్సెల్‌సెన్‌తో తలపడనున్నాడు. పురుషుల స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విక్టర్ అక్సెల్‌సెన్‌పై 14-21, 18-21 తేడాతో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సాత్వీక్‌ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి 21-15, 19-21, 23-21 తేడాతో కాంగ్ మిన్యుక్-సియో సెన్జీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అక్కడ మలేషియాకు చెందిన గో సెఫీ – నుర్ ఇజ్జుద్దీన్‌తో సెమీఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..