టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ‘మానాడు’.. ట్రెండింగ్‌‌లో టీజర్!

by  |
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ‘మానాడు’.. ట్రెండింగ్‌‌లో టీజర్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ శింబు పుట్టినరోజు సందర్భంగా ‘మానాడు’ మూవీ యూనిట్ టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. ఇక మూవీ విషయానికొస్తే శింబుకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండగా.. కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘రివైండ్‌’ పేరుతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ‘టైమ్ ఎవరి గురించి వెయిట్ చేయదు.. ఒకవేళ వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది?’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, భారతీ రాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్, కరుణాకరన్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మానాడు’ టీజర్‌లో యువన్ శంకర్ రాజా మ్యూజిక్ హైలెట్‌ కాగా.. ప్రస్తుతం ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌ మల్టీలింగువల్‌గా వస్తుండగా.. తెలుగు టీజర్‌ను మాస్ మహరాజ రవితేజ రిలీజ్ చేసి శింబుకు బర్త్ డే విషెస్ అందించారు. కాగా అనురాగ్ కశ్యప్, ఎ.ఆర్. రెహమాన్, కిచ్చా సుదీప్ హిందీ, తమిళ్, కన్నడ టీజర్‌ను విడుదల చేశారు.



Next Story

Most Viewed