థాంక్స్ కొవిడ్.. నీ వల్లే బిజీ అయిపోయా: సిద్ధు

106

దిశ, వెబ్ డెస్క్: సిద్దార్థ్..‘బొమ్మరిల్లు’ సినిమా ద్వారా మనవాడు అనిపించుకున్నాడు. ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ సినిమాల ద్వారా మరింత ఆదరణ పొందినా.. కలిసి రాక తెలుగు తెరకు దూరమయ్యాడు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత అజయ్ భూపతి డైరెక్షన్‌లో ‘మహాసముద్రం’ మూవీ ద్వారా కమింగ్ బ్యాక్ అంటున్నాడు సిద్ధు. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలిపిన సిద్ధు.. గ్రేట్ టీమ్‌తో వర్క్ చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. మీ ఆశీర్వాదం కావాలని ప్రేక్షకులను కోరాడు.

దీనితోపాటు తమిళ్‌లో వచ్చే ఏడాది నాలుగు సినిమాలు రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ సిరీస్ నవరస‌లో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నా అని తెలిపిన సిద్ధు.. గురువుగారు మణిరత్నం, జయేంద్ర సమర్పిస్తున్న సిరీస్‌లో నటించి, నిర్మించానని, ఇందులో పార్వతి తిరువోత్తుతో స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు చెప్పాడు.

ఇక హిందీలో ఎస్కే పే లైవ్ సిరీస్ చేస్తున్నట్లు వెల్లడించిన సిద్ధు.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపాడు. లాంగ్ బ్రేక్ తర్వాత బ్రేక్ లేకుండా సిరీస్, సినిమాలతో బిజీగా ఉండడం ఆనందంగా ఉందని కొవిడ్‌కు థాంక్స్ చెప్పాడు.