టీనేజ్‌లో అలా ఉన్న స్టార్ సింగర్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

by Dishafeatures1 |
టీనేజ్‌లో అలా ఉన్న స్టార్ సింగర్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ,సినిమా: టాలీవుడ్ లో ప్రతిభ గల సింగర్స్ కి ఉన్న క్రేజ్ వేరు. వారి పాటలతో అందరిని మంత్ర ముగ్దుల్ని చేసి కట్టిపడేస్తారు. ఈ టీవీ, జెమినీ, స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్ లో అనేక సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో సింగర్స్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. సంగీత దర్శకులు యువ సింగర్స్ ని ప్రోత్సహిస్తున్నారు. బాల సుబ్రహ్మణ్యం వంటి లెజెండరీ సింగర్ స్ఫూర్తితో గాయకులుగా మారిన వారు ఎందరో ఉన్నారు. వారిలో రమ్య బెహరా ఒకరు. ఈమె ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, నరసారావు పేట కు చెందిన రమ్య బెహరా టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా పేరున్న విషయం మన అందరికీ తెలిసినదే.

ఈమె రామాచారి వద్ద సంగీతం నేర్చుకొని సింగింగ్ షో లో పాల్గొని చాలా ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి కంట్లో పడింది. అసలు టాలీవుడ్ కి రమ్య బెహరా ను పరిచయం చేసింది కీరవాణినే. ఆయన కంపోజ్ చేసిన పలు సాంగ్స్ రమ్య బెహరా పాడారు. లచ్చిందేవికి ఒక లెక్కుంది, బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, ప్రేమకథా చిత్రం, లౌక్యం ఇలా అనేక చిత్రాల్లో సాంగ్స్ పాడింది.

రమ్య బెహరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ తన ఫోటోలు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అవి కాస్తా వైరల్ అవుతూ ఉంటాయి. కాగా ప్రస్తుతం రమ్య బెహరా టీనేజ్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అప్పటి లుక్ ని ఇప్పటి ఆమె లుక్ ని కంపేర్ చేసి అప్పుడు రమ్య బెహరా ఇలా ఉండేదా అని జనాలు షాక్ అవుతున్నారు.



Next Story

Most Viewed