శ్వేతా.. శ్వేతా..శ్వేతా.. ఎవరయ్యా ఈ శ్వేతా

by  |
శ్వేతా.. శ్వేతా..శ్వేతా.. ఎవరయ్యా ఈ శ్వేతా
X

దిశ,వెబ్‌డెస్క్: శ్వేతా.. శ్వేతా..శ్వేతా.. ఎవరయ్యా ఈ శ్వేతా అంటూ నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. ఆమె ఎవరో తెలియదు. ఎక్కడుంటారో తెలియదు. కానీ ఇప్పుడు ఆమె పేరు నెట్ లో మోతమోగుతుంది. ట్రెండింగ్ లో అయితే చెప్పనక్కర్లేదు. కొంతమంది ఔత్సాహికులు ఆమె గురించి తెలుసుకునేందుకు కుస్తీలు పడుతున్నారు.

కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో జీవిన విధానాలు పూర్తిగా మారిపోయాయి. నాలుగు గోడల మధ్య జరగాల్సిన క్లాస్‌లు ఆన్ లైన్ బాట పట్టాయి. ఆఫీస్‌లు వర్క్ ఫ్రమ్ హోమ్ కే పరిమితమయ్యాయి. అందులో జరిగే మీటింగ్ లు జూమ్‌లోకెక్కాయి. అయితే కొన్ని సార్లు ఈ జూమ్ లో జరిగే మీటింగ్ లు అందులో పాల్గొంటున్న వారి పరువును బజారుకీడ్చేలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ‘శ్వేతా యువర్ మైక్ ఈజ్ ఆన్’ అంటూ ఓ వీడియో కాల్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా సైట్లలో చక్కెర్లు కొడుతుంది. 2020లో #binod అనే పేరు ట్రెండింగ్ కాగా 2021లో #IPLAuction or #PetrolPriceHike లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పై హ్యాష్ ట్యాగ్స్ కంటే ‘శ్వేతా’ అనే హ్యాష్ ట్యాగ్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

శ్వేత ఎందుకు ట్రెండ్ అవుతుంది?

ఒక వేళ మీరు శ్వేత ఎవరు? ఆమె గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? శ్వేతా అనే యువతి ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో 111 మందితో జరుగుతున్న ఆన్ లైన్ క్లాస్‌‌లో శ్వేత తన జూమ్ కాల్ సౌండ్ ను మ్యూట్ చేయకుండా పర్సనల్ విషయాల్ని తన స్నేహితులతో మాట్లాడుతుంది. అంతే ఆమె మాటలు విన్న మిగిలిన విద్యార్ధులు కంగుతిన్నారు. ‘శ్వేతా యువర్ మైక్ ఈజ్ ఆన్’ అంటూ పిలిచేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed