మాజీ ప్రధానికి హెచ్‌ఆర్సీ చైర్మన్ నివాళి

by  |
మాజీ ప్రధానికి హెచ్‌ఆర్సీ చైర్మన్ నివాళి
X

దిశ, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ తీసుకున్ననిర్ణయం అభినందనీయమని హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం ఆయన నెక్‌లెస్ రోడ్డులోని పీవీ ఘాట్‌‌లో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీవీ ఒక ఆధ్యాత్మిక వేత్త, విద్యావేత్త, సాహితీ వేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ఆనందరావు పాల్గొన్నారు.


Next Story