కుప్పం సరిహద్దుల్లో కాల్పుల కలకలం

29

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో శనివారం కాల్పుల కలకలం రేగింది. తమిళనాడు నారాయణపురంలో డీఎంకే నేత వేలాయుధంపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో బుల్లెట్లు జేబులోని సెల్‌ఫోన్‌కు తగలడంతో డీఎంకే నేత వేలాయుధం ప్రాణాలతో బయట పడ్డారు. వెంటనే ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు వేలాయుధాన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.