మొదటిసారి కార్లను కొనేవారు పెరిగారు

by  |
మొదటిసారి కార్లను కొనేవారు పెరిగారు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ రబీ పంటలు, రుతుపవనాలతో పాటు సులభ రుణాల కారణంగా గ్రామీణంలో కార్ల విక్రయాలు పెరిగాయని ఆటో పరిశ్రమ వెల్లడించింది. పండుగ సమయంలో కార్ల అమ్మకాలు 10 శాతం నుంచి 15 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ భారీగా ఉంది. అక్టోబర్ రెండో వారం తర్వాత ప్రారంభమైన పండుగ సీజన్ సమయంలో సుమారు 11 శాతం వృద్ధితో మొత్తం 2.33 లక్షల కార్లను విక్రయించినట్టు మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

ఇందులో 40 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాత్నాల్లోనే నమోదయ్యాయని, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మొదటిసారి కార్లను కొనేవారి సంఖ్య 5 శాతం పెరిగి 54 శాతానికి చేరుకున్నట్టు శశాంక్ చెప్పారు. మొత్తం అమ్మకాల సంఖ్య గత ఐదేళ్లలో అత్యధికమని స్పష్టం చేశారు. పట్టణాల్లో అమ్మకాలు 47 శాతంగా ఉన్నాయని, మోడళ్ల పరంగా గమనిస్తె..ఆల్టో, ఈకో వ్యాన్, వ్యాగన్ ఆర్ కార్లకు అధిక డిమాండ్ కనిపించిందని కంపెనీ తెలిపింది. లాక్‌డౌన్ కాలంలోనూ గ్రామీణ అమ్మకాలు దాదాపు 60 శాతంతో పరిశ్రమకు తోడ్పాటును అందించాయని, మార్కెట్లు పునఃప్రారంభమైన తర్వాత అది 40 శాతానికి తగ్గింది. ఎంట్రీల్ ఎలవ కార్లకు(రూ. 3 నుంచి రూ. 7 లక్షల మధ్య) గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ భారీగా ఉండటం గమనించామని’ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్ఏడీఏ) అధ్యక్షుడు వింకేష్ గులాటి చెప్పారు.



Next Story

Most Viewed