గోల్ఫ్ కోర్సులు ఎందుకు బంద్ చేశారు : షేన్ వార్న్

by  |
గోల్ఫ్ కోర్సులు ఎందుకు బంద్ చేశారు : షేన్ వార్న్
X

కరోనా కారణంగా అన్ని రకాల క్రీడా పోటీలను ఆయా అసోసియేషన్లు, బోర్డులు వాయిదా వేశాయి. క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్ పోటీలతో సహా నాలుగేండ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒలింపిక్స్ కూడా ఏడాది పాటు వాయిదా వేశారు. క్రీడా పోటీలను తిలకించేందుకు అభిమానులు గుంపులుగా, వేల సంఖ్యలో వస్తే కరోనా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో ఆయా క్రీడలను రద్దు చేశారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ఒక వింత వాదన తెరపైకి తెచ్చాడు. ‘క్రీడాకారులు కలసి ఆడతారని, ప్రేక్షకులు గుమిగూడతారని క్రీడలన్నింటినీ వాయిదా వేశారు సరే.. మరి గోల్ఫ్ కోర్సులు ఎందుకు బంద్ చేశారని’ వార్న్ ప్రశ్నిస్తున్నాడు. వాటిని మూసేయడంలో నాకు ఎలాంటి కారణమూ కనిపించలేదని అంటున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో గోల్ఫ్ కోర్సులు తెరవాలని డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అంతా లాక్‌డౌన్ అయ్యి.. క్రీడాకారులకు ఎలాంటి ప్రాక్టీస్, వ్యాయాయం చేయడానికి వీలు లేకుండా పోయిందని.. గోల్ఫ్ కోర్సులు తెరవడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులు కూడా గోల్ఫ్ ఆడటం వల్ల మానసిక స్థైర్యాన్ని పొందుతారని తెలిపాడు.

ఈ క్లిష్ట సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి.. దయనీయ స్థితిలో ఉన్నారు. అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కానీ ఈ సమయంలో మానసిక స్థితిని కూడా అదుపులో ఉంచుకోవాలి. దీనికి గోల్ఫ్ చక్కని పరిష్కారం అని భావిస్తున్నట్లు వార్న్ వెల్లడించాడు. ‘నా 12 ఏండ్ల కూతురికి ఇంట్లోనే పాఠాలు చెబుతున్నాను. అదే విధంగా అప్పుడప్పుడు నా కుమారుడితో కలసి కాసేపు వీధిలో నడుస్తున్నాను. ఇలాంటి సమయంలో గోల్ఫ్ కోర్సులు కూడా తెరిస్తే.. మాలాంటి వారికి కాస్త వెసులుబాటుగా ఉంటుందని’ వార్న్ అంటున్నాడు. భౌతిక దూరం, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ అక్కడ గోల్ఫ్ ఆడటం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నట్లు వార్న్ చెప్పాడు.

Tags : Shane Warne, Golf course, social distance, Australia, lockdown



Next Story

Most Viewed