హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీ.. డబ్బు కోసమేనా?

76

దిశ, సినిమా : యాక్ట్రెస్ షమ సికిందర్ 10 ఇయర్స్ చాలెంజ్‌‌లో భాగంగా షేర్ చేసిన ఫొటోల కారణంగా ట్రోల్స్‌కు గురైంది. తను అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని నెటిజన్లు విమర్శించారు. అయితే తాను సర్జరీ చేయించుకోలేదని, కేవలం బొటాక్స్ ట్రీట్మెంట్ మాత్రమే తీసుకున్నానని షమ తెలిపింది. ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఆ సమయంలో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడంతో ట్రీట్మెంట్ తీసుకున్నానని వెల్లడించింది.

ఆ తర్వాత రియలైజ్ అయిన తాను.. వర్కౌట్, మెడిటేట్ చేయడం ప్రారంభించానని, ఇలాంటి ట్రోల్స్ తనను మళ్లీ నెగెటివిటీలోకి తీసుకెళ్లలేవని పేర్కొంది. అయినా ఎవరైనా యాక్ట్రెస్ లేదా యాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాళ్లు సంపాదించిన డబ్బులతో ఏదైనా చేయించుకునే స్వేచ్ఛ వారికి ఉందని, మధ్యలో వీరు ఎందుకు బాదర్ అవుతారో అర్థంకాదని చెప్పుకొచ్చింది షమ. అయినా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేది కెరియర్‌లో రాణించేందుకు, డబ్బు సంపాదించేందుకే కదా! అందులో తప్పేముంది? అని వివరించింది.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..