ఏపీ, తెలంగాణ మధ్య పలు ప్రత్యేక రైళ్లు రద్దు

by  |
ఏపీ, తెలంగాణ మధ్య పలు ప్రత్యేక రైళ్లు రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో రైళ్లు వెలవెలబోతున్నాయి. దీంతో అతి తక్కువ ఆక్యుపెన్సీ దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య పలు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

పలు ప్రాంతాల మధ్య నడిచే 28 ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 30 రైళ్లు సైతం రైల్వేశాఖ రద్దు చేసింది. శతాబ్ది, జనశతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కరోనా ఉధృతి కారణంగా రైళ్లలో రద్దీ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు.

పెద్దపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆగనున్న రైళ్ల వివరాలు..

ప్రయాణీకుల సౌలభ్యం కోసం పెద్దపల్లి రైల్వే స్టేషన్ వద్ద స్టాప్‌ను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీక్లీ స్పెషల్ ట్రైన్లను ప్రయాణికుల కోసం నిలుపుతున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్రైన్ నెం. స్టేషన్ పెద్దపల్లి స్టేషన్లో నిలిపే సమయం
07051 సికింద్రాబాద్ – దానపూర్ వీక్లీ స్పెషల్ 00.09/00.10
07052 దానపూర్ – సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ 21.00 /21.01
02575 హైదరాబాద్ – గోరఖ్‌పూర్ వీక్లీ స్పెషల్ 00.09/00.10
02576 గోరఖ్‌పూర్ – హైదరాబాద్ వీక్లీ ప్రత్యేక 10.58/10.59
07026 సికింద్రాబాద్ – రాక్సాల్ వీక్లీ స్పెషల్ 00 58/00.59
07025 రాక్సాల్ -సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ 15.03/15.04.

Next Story

Most Viewed