ఆధునిక హంగులతో నీరా కేంద్రం ఏర్పాటు: శ్రీనివాస్‌గౌడ్

by  |
ఆధునిక హంగులతో నీరా కేంద్రం ఏర్పాటు: శ్రీనివాస్‌గౌడ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: నీరాను ఎన్నో వ్యాధుల నివారణకు దివ్య ఔషధంగా ఆయుర్వేదంలో వాడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వం గీత వ‌ృత్తిదారుల అభివృద్ధికి కృషి చేస్తూ, కార్పొరేట్ తరహాలో నీరా కేంద్రాల నిర్మాణాలతో పాటు తాటి, ఈత చెట్ల ద్వారా తయారైన ఉత్పత్తులను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేస్తున్న నీరా కేంద్రం ప్రతిపాదిత స్థలాన్ని బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పర్యటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గీత వృత్తిదారుల అభివృద్ధి కోసమే ప్రతిష్ఠాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో చేతి వృత్తులు, కుల వృత్తుల పూర్వవైభవానికి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో గీత వృత్తిపై 4లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా 40లక్షల మంది కల్లు, నీరా ప్రాజెక్టుతో ఉపాధి పొందుతున్నారని తెలిపారు. రాజధాని నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు‌లో నీరా కేంద్రం ఏర్పాటు‌కు రూ.3 కోట్లతో టెండర్లు పూర్తి చేశామన్నారు. ఆధునిక హంగులతో కార్పొరేట్ తరహాలో నిర్మిస్తున్న ఈ నీరా కేంద్రంలో ఔషధాలతో పాటు వెజ్, నాన్ వెజ్‌లతో తెలంగాణ సంప్రదాయ వంటకాలను అందిస్తామన్నారు. దశల వారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలలో ఏర్పాటు చేస్తామన్నారు.



Next Story

Most Viewed