దూకుడు పెంచిన మార్కెట్లు..12 వేలు దాటిన నిఫ్టీ!

by  |
దూకుడు పెంచిన మార్కెట్లు..12 వేలు దాటిన నిఫ్టీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు దిశగా వెళ్తున్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ర్యాలీ చేశాయి. అదేవిధంగా దేశీ తయారీ రంగం పుంజుకుంటున్న సంకేతాలతో సూచీలు లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయంగా కూడా సానుకూల పరిణామాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారని, ప్రధాన షేర్లు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీల మద్దతుతో మార్కెట్లు లాభాల పంట పండించాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

బ్యాంకింగ్, మెటల్ రంగాల ర్యాలీతో నిఫ్టీ కొంతవిరామం తర్వాత 12 వేల మార్కును దాటింది. దీంతో వరుస నాలుగు రోజుల లాభాలతో సెన్సెక్స్ 724.02 పాయింట్లు ఎగసి 41,340 వద్ద ముగియగా, నిఫ్టీ 211.80 పాయింట్లు లాభపడి 12,120 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు దూసుకెళ్లగా, రియల్టీ మాత్రమే డీలాపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అన్ని షేర్లు లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగా ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్, టైటాన్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్, మారుతీ సుజుకి, ఎన్‌టీపీసీ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.10 వద్ద ఉంది.

Next Story

Most Viewed