నష్టాల నుంచి లాభాల్లోకి మారిన స్టాక్ మార్కెట్లు!

by  |
నష్టాల నుంచి లాభాల్లోకి మారిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఉదయం భారీ నష్టాల నుంచి చివర్లో అధిక లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అనంతరం కరోనా కేసుల పెరుగుదల వల్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఓ దశలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనమైన తర్వాత మిడ్-సెషన్ నుంచి కీలక రంగాల మద్దతు లభించింది. ప్రధానంగా మెటల్, ఫార్మా స్టాక్స్ ర్యాలీతో లాభాలు దక్కాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 259.62 పాయింట్లు ర్యాలీ చేసి 48,803 వద్ద ముగియగా, నిఫ్టీ 76.65 పాయింట్లు లాభపడి 14,581 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఫార్మా రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డా రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఇన్ఫోసిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకి, నెస్లె ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.11 వద్ద ఉంది.



Next Story

Most Viewed