వారాంతంలో మార్కెట్లకు లాభాలు!

by  |
వారాంతంలో మార్కెట్లకు లాభాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస లాభాల అనంతరం గురువారం భారీ నష్టాలను చూసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం లాభాలను నమోదు చేశాయి. అమెరికా మార్కెట్లకు టెక్ దిగ్గజాల అండ దొరకడంతో, ఆసియా మార్కెట్లో సానుకూల ధోరణి కనిపించింది. ఈ ప్రభావం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకరంగా ఉండటంతో శుక్రవారం సూచీలు తిరిగి లాభాల్లో ట్రేడయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో ముందు రోజు నష్టాలను అధిగమించేందుకు బ్యాంకింగ్ రంగ సూచీలు సాయపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 214.33 పాయింట్లు ఎగిసి 38,434 వద్ద ముగియగా, నిఫ్టీ 59.40 పాయింట్లు లాభపడి 11,371 వద్ద ముగిసింది. ఉదయం మార్కెట్ల ప్రారంభం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహంతో 300 పాయింట్లకు పైగా ఎగసిన సూచీలు చివర్లో మందగించాయి. మిడ్ సెషన్ సమయం నుంచి సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ (NTPC), ఏషియన్ పెయింట్ (Asian Paints), పవర్‌గ్రిడ్ (Powergrid), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), నెస్లె ఇండియా (Nestle India), సన్‌ఫార్మా (Sun Pharma), ఎస్‌బీఐ (SBI), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఆల్ట్రా సిమెంట్ (Ultra Cement), టెక్ మహీంద్రా (Tech Mahindra), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) షేర్లు అధిక లాభాల్లో ట్రేడవ్వగా… ఓఎన్‌జీసీ (ONGC), భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel), టాటా స్టీల్ (TATA Steel), రిలయన్స్ (Reliance), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ (HCL) షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ నిన్నటికంటే ఇవాళ కొంత బలపడి రూ. 74.84 వద్ద ఉంది.



Next Story

Most Viewed