కొనసాగుతున్న మార్కెట్ల రికార్డులు!

by  |
కొనసాగుతున్న మార్కెట్ల రికార్డులు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డు ముగింపును సాధించాయి. ఓ వైపు ఆర్థికవ్యవస్థ రికవరీ సాధిస్తున్నదనే అంచనాలు, మరోవైపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తున్న ఆశలతో మదుపర్లు మరింత ఉత్సాహంగా ఉన్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండటం, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలపడుతుండటం కూడా మార్కెట్ల ర్యాలీకి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 181.54 పాయింట్లు ఎగసి 45,608 వద్ద ముగియగా, నిఫ్టీ 37.20 పాయింట్లు లాభపడి 13,392 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు 7 శాతానికి పైగా పుంజుకోగా, ఐటీ, రియల్టీ రంగాలు బలపడ్డాయి. ఫార్మా, మెటల్, మీడియా రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, టీసీఎస్, రిలయన్స్, హెచ్‌సీఎల్ షేర్లు లాభపడగా, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.58 వద్ద ఉంది.



Next Story

Most Viewed