"జగదేకవీరుడు అతిలోకసుందరి" సంగీత దృశ్య కావ్య కథ

by  |
జగదేకవీరుడు అతిలోకసుందరి సంగీత దృశ్య కావ్య కథ
X

జగదేకవీరుడు అతిలోకసుందరి… తెలుగు ప్రేక్షకలోకం మరిచిపోలేని అపురూప దృశ్య కావ్యం. అందాల తార శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవి… కలయికలో తెరకెక్కిన ఈ ఆణిముత్యం మూడు దశాబ్దాలు పూర్తైనా ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

కాగా ఈ చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ … ఈ సినిమాను అద్భుతంగా రూపుదిద్దిన ఛాంపియన్స్ గురించి నాని మాటల్లో వినిపించే ప్రయత్నం చేసింది. మ్యూజికల్ వండర్ సెల్యులాయిడ్ లో ప్రతీ ఫ్రేమ్ ను మ్యాజికల్ గా చూపించిన DOP విన్ సెట్ అయితే…అందమైన సెట్స్ తో ప్రేక్షకులను మైమరపింప చేశారు ఆర్ట్ డైరెక్టర్ చలం. ఎడిటింగ్ స్కిల్స్ తో చిట్టి సినిమాకు సూపర్ టెంపో ఇస్తే.. పాటలు, మాటలతో వేటూరి, జంధ్యాల మెస్మరైజ్ చేయగా.. వీరందరి కష్టానికి ప్రాణం పోశారు ఒకే ఒక లెజెండ్ మ్యూజికల్ మ్యాస్త్రో ఇళయ రాజా.

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ప్రతీ పాట ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమాకు సంగీతం అందించినప్పుడు అన్ని పాటలు క్లాసికల్ మెలోడీగా ఉన్నాయట. దీంతో శ్రీదేవి, చిరు కాంబినేషన్ అంటే ప్రేక్షకులు మాస్ సాంగ్ కోరుకుంటారు కదా అని అభ్యంతరం వచ్చిందట. దీంతో దర్శకులు రాఘవేంద్రరావు ఆలోచనలో పడినా.. ఆ ట్యూన్ మార్చడం నిర్మాత అశ్వినీదత్ కు ఇష్టం లేదట. దీంతో ట్యూన్ మార్చకుండానే నా లిరిక్స్ తో మాస్ సాంగ్ గా మార్చేస్తానని చెప్పారట వేటూరి. అల వచ్చిందే అబ్బనీ తీయనీ దెబ్బ పాట. ఈ సాంగ్ ఎంత మ్యూజికల్ హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక మరో పాట దినక్కుత దినక్కురో .. ఈ పాట షూటింగ్ కంప్లీట్ చేసి విదేశాల్లో హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొనాలట శ్రీదేవి. కానీ ఆ టైంలో చిరుకి హై ఫీవర్ ఉందట. అయినా సరే ఎవరికి ఎఫెక్ట్ పడకూడదనే ఉద్దేశంతో అంత జ్వరంతోనూ చిరు షూటింగ్ లో పాల్గొన్నారట. అందుకే ఆయన మెగాస్టార్ అయింది అని చెప్తుంటారు ప్రముఖులు. ఇది జగదేకవీరుడు అతిలోకసుందరి సంగీత ప్రయాణం.

Tags: Jagadeka Veerudu Athiloka Sundari, Chiranjeevi, Sridevi, Raghavendra Rao, C. Ashwini Dutt

Next Story

Most Viewed