కమిట్ మెంట్ అడిగిన హీరో.. మీ కూతురిని అతని రూమ్ కి పంపిస్తే వస్తానన్న హీరోయిన్

547
khushboo news

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతమంది హీరోయిన్లు ఎన్నో సందర్బాల్లో నిర్మొహమాటంగా చెప్పారు.. ఇంకొంతమంది హీరోయిన్లు వారిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి కోర్టు వరకు కూడా లాగారు. ఇక ఈ వేధింపులు ఇప్పుడిప్పుడే మొదలయినవి కాదని, ఒకప్పుడు కూడా ఎలాంటివి తాము ఎదుర్కొన్నామని సీనియర్ నటీమణులు నొక్కి వక్కాణించారు కూడా. ఇక తాజాగా ఒక సీనియర్ నటి తనకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పి అభిమానులందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

‘కలియుగ పాండవులు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఖుష్బూ. తన తొలి సినిమాతోనే సంచలనంగా మారటమే కాదు.. తాను కొందరు హీరోలతో మాత్రమే నటిస్తానని ఓపెన్ గా చెప్పి మరీ అగ్రస్థానంలో నిలిచిన ఈ హీరోయిన్  తక్కువ కాలంలోనే అటు కోలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కోలీవుడ్ లో ఖుష్బూ కున్న స్టార్‌ ఇమేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఎంతగానో ఆరాధించే అభిమానులు ఖుష్బూ కోసం ఏకంగా గుడి కూడా కట్టించారు. ఇక ఇంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటికి కూడా వేధింపులు తప్పలేదు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్భూ తన సినీ కెరీర్లో ఒక హీరో కమిట్ మెంట్ అడిగినట్లు చెప్పుకొచ్చింది. “నేను హీరోయిన్ గా ఉన్న రోజుల్లో  ఒక టాలీవుడ్ సీనియర్  హీరో నన్ను కమిట్ మెంట్ అడిగాడు. ఆయన మాట విని నేను షాక్ అయ్యాను. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి  అలా అడిగేసరికి నా కోపం కట్టలు తెంచుకుంది. మీ కూతురిని నా తమ్ముడి రూమ్ లోకి పంపించండి.. నేను మీ రూమ్ లోకి వస్తాను అని చెప్పాను” అని చెప్పుకొచ్చింది. ఆ మాటతో సదరు హీరో నోటమాట రాలేదని తెలిపారు. ఇక అంత పెద్ద కూతురు ఉన్న స్టార్ హీరో ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఖుష్బూ అటు రాజకీయాలలోను, సినిమాలలో ప్రత్యేక పాత్రలలోను నటిస్తూ బిజీగా ఉన్నారు.