- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ ఓటర్లకు గమనిక.. మీ ఓటు గల్లంతైందా.. అయితే ఇలా చేయండి
దిశ, వెబ్‌డెస్క్ : ఏ ఎన్నికలలోనైనా దొంగ ఓట్లు వేయడం జరుగుతుందనేది అందరికి తెలిసిందే. ఓటర్లు ఓటు వేయడానికి వెళ్లే సరికి ఎవరో ఒకరు తమ ఓటును వేసి వెళ్తారు.. దాంతో నకిలీ ఓటర్లు ఓటేయటంతో తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని వారు ఓటు వేయకుండా పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లి పోతుంటారు. అయితే అలాంటి వారికోసమే ఈ సమాచారం.. మీరు ఓటును వేయలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఓటు హక్కును మనం తిరిగి సాధించుకునేందుకు ఎన్నికల చట్టం అవకాశం కల్పిస్తోంది. రూ. 5 తో మన ఓటు హక్కును మనం పొందవచ్చు. అది ఎలా అంటే ఎన్నికల సంఘం మన ఓటు హక్కును మనం వినియోగించుకునేందుకు సెక్షన్ 49పీని తీసుకొచ్చింది.
సెక్షన్ 49పీ ఏం చెబుతుంది..
ఎన్నికల సమయంలో ఎవరైనా మన ఓటును వేసి వెళ్లినప్పుడు మన ఓటును మనం సాధించుకునేందుకు 49 పీ ఉపయోగపడుతుంది. ఏవరైనా మన ఓటు వేసి వెళ్లారని తెలియగానే.. మనం తిరిగి వెళ్లకుండా పోలింగ్ కేంద్రంలోనే చాలెంజ్ ఓటును నమోదు చేసుకోవచ్చు. కండాక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని సెక్షన్ 49పీ ప్రకారం ఎవరైనా మన ఓటును వేసి వెళ్లినప్పుడు ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరే అవకాశం ఉంటుంది. అనతరం మనం చాలెంజ్ ఓటును రూ.5 అక్కడి ప్రిసైడింగ్ అధికారికి చెల్లించి ఓటును నమోదు చేయాల్సిందిగా కోరితే అతని వద్ద ఉన్న గుర్తింపుకార్డు తదితరాలన్నింటినీ పరిశీలించి అనుమతి ఇస్తారు. ఈ ఓటు ప్రత్యేకమైనదిగా ఉంచి అవసరాన్ని బట్టి ఉపయోగిస్తారు.