16 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ: తలసాని

by  |
16 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ: తలసాని
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కానుకగా రెండో విడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు గొల్ల కురుమల కుటుంబాల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు. ఈ మేరకు మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…డీడీలు కట్టిన 28 వేల 335 మందికి సబ్సిడీపై గొర్రెల పంపిణీ కి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.

రూ. 360 కోట్ల వ్యయంతో గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం 16న నల్గొండలో ప్రారంభమవుతుందన్నారు. ఆఖరి కుటుంబం వరకు గొల్ల ,కురుమలకు గొర్రెల పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. బర్ద్ ఫ్లూ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేవన్నారు. వచ్చే అవకాశం లేదని , రెండు రోజలుగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కోళ్లు చనిపోయాయని వార్తలు వచ్చాయని చెప్పారు. అవి పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావడంతో వాతావరణంలో మార్పు వల్ల మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. బర్ద్ ఫ్లూ ను ఎదుర్కొనేందుకు 13 వందల టీమ్‌లు రెడీగా ఉన్నాయన్నారు.

Next Story

Most Viewed