మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది

by Disha Web Desk 15 |
మళ్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది
X

దిశ,దుబ్బాక : మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని, ప్రజలు అధైర్య పడొద్దని, బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మెదక్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధి శ్రీ రేకులకుంట ఎల్లమ్మ, మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాజక్క పేట గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించాడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రేకులకుంట మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ దీవెనలతో రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిపించి తనను పార్లమెంటుకు, మొదటి సారి అసెంబ్లీ కి పంపిన మాదిరిగానే ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. ఐదేండ్ల పాటు దుబ్బాకను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు.

దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి భారీ మెజార్టీని అందజేసి పార్లమెంట్​కు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. గెలిచిన నెల రోజుల్లోనే వంద కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తానని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు. గత రెండేళ్ల నుంచి జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. జిల్లాలో చేసిన ఉద్యోగంతో ప్రజా సమస్యలపై పూర్థిస్థాయిలో అవగాహన ఉన్నదని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తారన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్​పై బుదరజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని రేవంత్​రెడ్డి మాట తప్పారన్నారు. రూ.2 లక్షలు రుణమాఫీ, రూ.4 వేల పింఛన్, రైతుబంధు, మహిళలకు రూ.2500, పంట బోనస్ రూ.500 ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. కేసీఆర్ వల్లే మన కాలువల్లోకి నీళ్లు వచ్చి రెండు పంటలు పండాయన్నారు.

మల్లన్ సాగర్ తో చెరువులు నింపి బంగారం లాంటి పంటలు పండించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలలో నీటి సమస్య తలెత్తకుండా ఇంటి ముందే నల్లా క్యాప్ తిప్పగానే మిషన్ భగీరథ నీరు వచ్చేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో మళ్లీ వెనకటి కాలం వచ్చి ప్రజలు నీళ్ల బిందెలతో రోడ్ల పొంటి కనిపిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ని ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తాడని అన్నారు. గత రెండేళ్ల నుంచి జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. జిల్లాలో చేసిన ఉద్యోగంతో ప్రజా సమస్యలపై పూర్థిస్థాయిలో అవగాహన ఉన్నదని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తారన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్​పై బుదరజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని రేవంత్​రెడ్డి మాట తప్పారన్నారు. రూ.2 లక్షలు రుణమాఫీ, రూ.4 వేల పింఛన్, రైతుబంధు, మహిళలకు రూ.2500, పంట బోనస్ రూ.500 ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు.

కేసీఆర్ వల్లే మన కాలువల్లోకి నీళ్లు వచ్చి రెండు పంటలు పండాయన్నారు. మల్లన్న సాగర్ తో చెరువులు నింపి బంగారం లాంటి పంటలు పండించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలలో నీటి సమస్య తలెత్తకుండా ఇంటి ముందే నల్లా క్యాప్ తిప్పగానే మిషన్ భగీరథ నీరు వచ్చేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో మళ్లీ వెనకటి కాలం వచ్చి ప్రజలు నీళ్ల బిందెలతో రోడ్ల పొంటి కనిపిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ని ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తాడని అన్నారు. జిల్లాలో కలెక్టర్​గా పనిచేసిన తనకు దుబ్బాక ప్రాంతంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ప్రతి ఒక్కరూ తనను గుర్తుంచుకుంటారన్నారు. ఎంపీగా తనని గెలిపిస్తే ప్రజలకు సేవ చేయడంతో పాటు పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపే భాగ్యం కలుగుతుందన్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో డ్వామా పీడీగా, జాయింట్‌ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా

పనిచేసిన అనుభవం ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్, మనోహర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత, ఎంపీపీ కొత్త పుష్పలత, జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, రాజక్క పేట ఎంపీటీసీ రథ మనోహర్ రెడ్డి, కౌన్సిలర్లు నిమ్మరజిత, అస యాదగిరి, అస స్వామి, సీనియర్ నాయకులు కోమటి రెడ్డి రజినికాంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటనర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు బానల శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు తీపి రెడ్డి మహేష్ రెడ్డి, శేపూరి శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed