కూలుతున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె…మరమ్మత్తులు చేయాలంటున్న గ్రామస్తులు

by Kalyani |
కూలుతున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె…మరమ్మత్తులు చేయాలంటున్న గ్రామస్తులు
X

దిశ, యాచారం : ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె శిథిలమై ఓవైపు మొత్తం కూలుతూ.. జనవాసాల మధ్య ప్రమాదకరంగా మారింది. విద్యుత్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని చౌదర్ పల్లి, గ్రామ శివారులో నంది వనపర్తి గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె, ఓ వైపు రాళ్లు పడిపోయి కూలుతోంది. దిమ్మె కు కంచె లేక వచ్చేది వర్షాకాలం కావడంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వస్తే దిమ్మె కూలడం ఖాయమని ఇప్పటికైనా అనుకోని ప్రమాదం చోటు చేసుకోక ముందు దానికి మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story

Most Viewed