అనంత విశ్వంలోని 140 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమికి లేజర్ సందేశం

by Dishanational1 |
అనంత విశ్వంలోని 140 మిలియన్ మైళ్ల దూరం నుంచి భూమికి లేజర్ సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: అనంత విశ్వంలోని సుదూరం నుంచి భూమికి లేజర్ సందేశం అందించట్టు అమెరికా అంతరిస్ఖ సంస్థ నాసా ప్రకటించింది. ఆ సిగ్నల్ సుమారు 140 మిలియన్ మైళ్ల దూరం నుంచి వచ్చినట్టు నాసా పేర్కొంది. అంతరిక్షంలోకి తాము పంపిచిన సైకీ 16 స్పేస్‌క్రాఫ్ట్ లేజర్ సిగ్నల్ పంపింది. గతేడాది అక్టోబర్‌లో నాసా సైకీ 16 గ్రహశకలంపై పరిశోధనలకు స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యన ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఉన్న సైకీ16 గ్రహశకలం రోదసీలోనే అరుదైన మూలకాలను కలిగి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సైకీ స్పేస్‌క్రాఫ్ట్‌ అనేది డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనిఏషన్స్ వ్యవస్థ(డీఎస్ఓసీ) సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది సుదూర అంతరిక్షంలోకి లేజర్ కమ్యూనికేట్ చేస్తుంది. ప్రస్తుత రేడియో తరంగాల కంటే చాలా వేగవంతమైన కమ్యూనికేషన్‌ను ఇది అందిస్తుంది. తాజాగా సైకీ స్పేస్‌క్రాఫ్ట్‌లోని లేజర్ వ్యవస్థ 140 మిలియన్ మైళ్ల దూరం నుంచి డేటాను బదిలీ చేసింది. ఈ దూరం భూమి, సూర్యూడికి మధ్య ఉన్న్న దూరం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. సైకీలోని డీఎస్ఓసీ రేడియో ట్రాన్స్‌మిటర్‌తో విజయవంతంగా అనుసంధానం అయింది. ఇది అంతరిక్ష నౌక నుంచి నేరుగా భూమికి సమాచారం, డేటాను ప్రసారం చేస్తుంది.

Next Story

Most Viewed