స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేదలు.. అధికార పార్టీ అనూహ్య నిర్ణయం

by GSrikanth |
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేదలు.. అధికార పార్టీ అనూహ్య నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: మరో కొత్త ప్రచార కార్యక్రమానికి అధికార వైసీపీ శ్రీకారం చుట్టింది. అధికారమే లక్ష్యంగా ‘సిద్ధం’ పేరుతో మరో ప్రచార కార్యక్రమానికి సిద్ధమైంది. ఈ ప్రచారానికి సంబంధించిన బస్సులను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైసీపీ మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు ప్రటించారు. బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికీ ప్రచారం చేయబోతున్నారని వెల్లడించారు. జగన్ కోసం బస్సు యాత్రలను తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని సజ్జల హర్షం వ్యక్తం చేశారు.


ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 బస్సులతో స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తారని తెలిపారు. పలువురు పేదలను పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా చేర్చినట్లు ప్రకటించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు హక్కు కల్పించేలా తమ ప్రచారం ఉండబోతోందని అన్నారు. ఏపీలో 87 పేదలకు ప్రభుత్వ పథకాలు అందాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల క్యాలెండర్‌ను కూడా ప్రజలకు అందిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ వికృత చేష్టలు పెరిగాయని విమర్శించారు. ఎన్నికలంటే డబ్బు కాదని.. ప్రజలకు మంచి చేయడమే రాజకీయమన్నారు.Next Story

Most Viewed