పాలపుంతకి అవతల పీల్చగలిగే ఆక్సిజన్?

by  |
పాలపుంతకి అవతల పీల్చగలిగే ఆక్సిజన్?
X

దిశ, వెబ్‌డెస్క్: మన పాలపుంతకి అవతల పీల్చగలిగే ఆక్సిజన్ ఉందా? అనే ప్రశ్నకు శాంఘై ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు అవుననే సమాధానమిస్తున్నారు. అవును… మొదటిసారిగా మన పాలపుంతకి సుదూరంలో ఉన్న ఒక గెలాక్సీ మీద శాస్త్రవేత్తలు మాలిక్యులర్ ఆక్సిజన్ ఉనికిని కనిపెట్టారు. మార్కరియన్ 231 అని పిలిచే ఈ గెలాక్సీ నుంచి భూమ్మీదికి వచ్చిన కాంతి తరంగాలను విశ్లేషించి వారు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. కాకపోతే ఈ గెలాక్సీ మన భూమికి 581 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

భూమ్మీద ఇప్పటికే ఆక్సిజన్‌తో పాటు ఇతర వాయువులు ఉండటం వల్ల కాంతి తరంగాలు పరావర్తనం చెందడంతో కచ్చితమైన రీడింగులు పొందలేకపోయామని, కానీ వారికి అందిన రీడింగులతో పోలిస్తే ఆ గెలాక్సీ మీద 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉండొచ్చని అంటున్నారు. ఈ కాంతి తరంగాల రీడింగులను స్పెయిన్‌లోని ఇరామ్ 30 టెలిస్కోప్, ఫ్రెంచ్ ఆల్ఫ్స్‌లోని నార్తర్న్ ఎక్స్‌టెండెడ్ మిల్లీమీటర్ ఆర్రే టెలిస్కోప్ ద్వారా తీసుకున్నారు. గత 20 ఏళ్లలో పాలపుంత లోపల రో ఒపియుచీ, ఓరియన్ నెబ్యులా ప్రదేశాల్లో మాలిక్యులర్ ఆక్సిజన్ ఉందని తెలిసింది. అయితే పూర్తిగా స్వచ్ఛమైన ఆక్సిజన్‌ని మానవులు పీల్చుకోలేరు. దాన్ని ఎక్కువ సేపు పీల్చుకోవడం వల్ల శాశ్వతంగా ఊపిరితిత్తులు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్‌లో మోయగలిగిన పరిమాణం కంటే ఆక్సిజన్ ఎక్కువ అవడమే ఇందుకు కారణం.


Next Story

Most Viewed