ఆక్సిజన్ పీల్చుకోకుండా బతికే జీవి ఇదే!

by  |
ఆక్సిజన్ పీల్చుకోకుండా బతికే జీవి ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్:
భూమ్మీద బతకడానికి ప్రతి జంతువు ఆక్సిజన్ పీల్చుకోవాల్సిందేనని చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. అది నీటిలో కరిగిన ఆక్సిజన్ అయినా కావొచ్చు, లేదా గాలిలో వాయువు రూపంలోనైనా కావొచ్చు. కానీ జంతువు బతకాలంటే ఆక్సిజన్ కావాల్సిందేనని అనుకున్నాం. కానీ కొత్తగా ఆక్సిజన్ పీల్చుకోకుండా బతుకుతున్న ఓ చిన్న జంతువును ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు.

హెన్నెగువా సాల్మినికోలా అని పిలిచే ఈ జీవి శరీరం కేవలం పది కణాలతో నిర్మితమై ఉంటుంది. సాల్మన్ చేప కండరాల్లో ఇది నివాసముంటుంది. జెల్లీఫిష్, కోరల్ జాతుల మిక్సోజోవన్ గా ఇది పరిణామం చెంది కాలక్రమేణా శక్తి ఉత్పత్తి కోసం ఆక్సిజన్ సంగ్రహణాన్ని త్యజించి ఉండొచ్చని ప్రొఫెసర్ డోరోతీ హుచన్ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే జీవపరిణామక్రమంలో చాలా మార్పులు సంతరించుకున్నట్లు తెలుస్తోందని చెప్పారు. దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోలేకపోయినప్పటికీ బహుశా చేప కండరాల్లో ఉన్న శక్తి నుంచి ఇది గ్రహిస్తుందేమోనని అనుమానం ఉన్నట్లు డోరోతి తెలిపారు.

Next Story

Most Viewed