18 నుంచి ఢిల్లీలో బడులు ప్రారంభం

31

న్యూఢిల్లీ: పాఠశాలలను పున: ప్రారంభించడానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 18 నుంచి 12 తరగతుల వరకు అన్ని పాఠశాలలను నిర్వహించడానికి అనుమతులు ఇస్తూ రాష్ట్ర విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, పిల్లలను స్కూళ్లకు పంపించాలా లేదా అనే విషయమై తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేసింది.

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించగానే మార్చి 23 నుంచి ఢిల్లీలోని అన్ని స్కూళ్లను మూసివేశారు. 2020-21 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు విద్యార్థులు ఒక్కరోజు కూడా పాఠశాలలకు హాజరైన దాఖలాలు లేవు. మే 4వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ ప్రకటించడంతో పాఠశాలల పున: ప్రారంభానికి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.