విద్యార్థుల భవిష్యత్ కోసమే పాఠశాలలు: మంత్రి సబితా

by  |
subitha-schools s
X

దిశ, చేవెళ్ల :విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వైద్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం, తదితర సౌకర్యాల గురించి ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధన నిమిత్తం పాఠశాలలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామం లోని ఉన్నత పాఠశాలలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని ఆమె పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు పాఠశాలలో ఏ పనులు చేశారో ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు జిల్లా విద్యాధికారి ద్వారా రాష్ట్ర కార్యాలయానికి నివేదిక పంపించాలని ఆదేశించినట్లు తెలిపారు.

పాఠశాల ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు వైరల్ ఫీవర్ జ్వరంలాంటి ఏవైనా వ్యాధులు వస్తే, వెంటనే చికిత్సలు జరిపించాలని, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల రవాణా నిమిత్తం పాఠశాలలను, బస్సులను తనిఖీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మంత్రితో పాటు డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ గాయత్రి గోపాలకృష్ణ, ఉపసర్పంచ్ అబ్దుల్ ఇనాయత్, విద్యా కమిటీ చైర్మన్ శివరాం, గ్రామ కార్యదర్శి స్వాతి మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed