గాజాకు సాయం అందించనున్న బ్రిటీష్ దళాలు..!

by Dishanational6 |
గాజాకు సాయం అందించనున్న బ్రిటీష్ దళాలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాకు సాయం అందించే బాధ్యత బ్రిటీష్ దళాలు తీసుకోవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. యూఎస్ మిలటరీ నిర్మాణంలో ఉన్న ఆఫ్ షోర్ పీర్ నుంచి గాజాకు సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నివేదికపై స్పందించేందుకు యూకే అధికారులు నిరాకరించారు.

బ్రిటీష్ ప్రభుత్వం ట్రక్కులను నడపడానికి దళాలను మోహరించడం గురించి ఆలోచిస్తోందని బీబీసీ నివేదిక తెలిపింది. తేలియాడే కాజ్‌వే ద్వారా ఒడ్డుకి ట్రక్కులు చేరుకున్నాయి. వీటిద్వారా గాజాకు సాయం అందించాలని యోచిస్తోంది. కానీ దీనిపై బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ గానీ, ప్రభుత్వాధికారులు గానీ స్పందించలేదు.

వందలాది మంది అమెరికా సైనికులు, నేవీ సిబ్బంది కలిగి ఉండే రాయల్ నేవీ షిప్ నిర్మాణానికి బ్రిటన్ ఇప్పటికే లాజిస్టిక్ మద్దతు అందిస్తోంది. అదనంగా, బ్రిటిష్ మిలిటరీ ప్లానర్‌లను ఫ్లోరిడాలోని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్లానర్స్ ని పొందుపరిచారు. గాజాకు మందుల సాయం పరీక్షిస్తామని యూకే మంత్రిత్వశాఖ తెలిపింది. గాజా ప్రజలను చేరుకోవడానికి కీలకమైన మానవతా సహాయం కోసం మేము మరిన్ని మార్గాలను ఏర్పాటు చేయడం చాలా కీలకం అని అమెరికా పేర్కొంది. అమెరికా, అంతర్జాతీయ మిత్రదేశాలకు సాయం అందించేందుకు బ్రిటన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు యూకే రక్షణ శాఖ.

ఇకపోతే, గాజాలో ఓడరేవు అభివృద్ధి, సాయంపై విమర్శలు వెల్లువెత్తాయి. గాజా జనాభాలో కనీసం నాలుగింట ఒక వంతు మంది ఆకలి అంచున ఉన్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలోని దాడితో ఇజ్రాయెల్-హమాస్ ప్రారంభమైంది, ఇందులో మిలిటెంట్లు దాదాపు 1,200 మందిని హతమార్చారు, ఎక్కువ మంది పౌరులు, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకున్నారు. మిలిటెంట్లు ఇంకా 100 మంది బందీలుగానే ఉంచారు. మరో 30 మందికి పైగా అశేషాయాలున్నాయని తెలిపింది ఇజ్రాయెల్.

Next Story