జాగ్రత్త అంటూ ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ!

by  |
జాగ్రత్త అంటూ ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులను మోసపూరిత్ కస్టమర్ కేర్ నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చాలామంది బ్యాంకుకు సంబంధించిన వివరాల కోసం గూగుల్ ద్వారా లభించే కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేస్తున్నారని, అవతలి వారు అడిగిన విధంగా వ్యక్తిగత వివరాలు ఇస్తున్నారు. దీనివల్ల మోసపూరిత కస్టమర్ కేర్ సెంటర్లు అలాంటి ఖాతాల నుంచి డబ్బును దోచేస్తున్నారని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎస్‌బీఐ బ్యాంకుకు సంబంధించి ఏ సమాచారం కావాలనుకున్నా అధికారిక వెబ్‌సైట్ ద్వారా నంబర్‌ను సంప్రదించడం మేలని బ్యాంకు పేర్కొంది. బ్యాంకింగ్ సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని, నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల పట్ల అప్రమత్తగా ఉండాలని వివరించింది. దీనికి సంబంధించి సోమవారం ఎస్‌బీఐ బ్యాంకు అధికారికంగా ఓ వీడియో ద్వారా ఖాతాదారులకు సూచనలిచ్చింది. ఎస్‌బీఐ ప్రకారం.. వినియోగదారులు స్పష్టంగా ధృవీకరించని నంబర్ల నుంచి ఎస్‌బీఐ కస్టమర్ కేర్ ఆఫీసర్ పేరున ఫోన్‌లు వస్తే ఫిర్యాదు చేయాలని తెలిపింది. కాగా, గతంలో సైతం ఎస్‌బీఐ మోసపూరిత, నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల విషయంలో ఖాతాదారులను అప్రమత్త చేసింది.


Next Story

Most Viewed