‘సేవ్ డెమోక్రసీ, సేవ్ కంట్రీ’ మా స్లోగన్ : మమతా బెనర్జీ

by  |
‘సేవ్ డెమోక్రసీ, సేవ్ కంట్రీ’ మా స్లోగన్ : మమతా బెనర్జీ
X

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మమతా బెనర్జీ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన శుక్రవారం ముగిసింది. తన పర్యటన ఫలప్రదంగా సాగిందని, ప్రతిపక్ష నేతలతో మంచి చర్చ జరిగిందని ఆమె వివరించారు. సోనియా గాంధీతో సానుకూల సంభాషణ జరిగిందని, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడారని, విపక్ష కూటమి గురించి చర్చించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముందని అన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో శుక్రవారం భేటీ అయ్యారని, తన ఢిల్లీ పర్యటన సక్సెస్‌ఫుల్‌గా సాగిందని తెలిపారు. తామంతా రాజకీయ అంశాలపై చర్చించామని చెప్పారు.

దేశంలోని ప్రజాస్వామ్యం నిలవాలని, ‘సేవ్ డెమోక్రసీ, సేవ కంట్రీ’ తమ స్లోగన్ అని తెలిపారు. ప్రతి రెండు నెలలకోసారి ఢిల్లీకి పర్యటిస్తారని అన్నారు. 2024 జనరల్ ఎలక్షన్స్‌పై ప్రశ్నలు వేయగా దాటవేశారు. ‘దేశం అభివృద్ధి చెందాలి. ప్రజలు అభివృద్ధి చెందాలి. ప్రస్తుతం ధరలు సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నాయి. పెట్రోల్, వంటగ్యాస్ భారీగా పెరిగాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు ఉండనే ఉన్నది’ అని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఆమె సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, పలువురు విపక్ష నేతలతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలతోనూ సమావేశమయ్యారు.


Next Story

Most Viewed