- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
44 శాతం తగ్గిన సౌదీ అరామ్‌కో లాభాలు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ చమురు దిగ్గజ కంపెనీ సౌదీ అరామ్‌కో 2020లో లాభాలు 44.4 శాతం పడిపోయాయని ఆదివారం తెలిపింది. దాదాపు సగానికి తగ్గిన లాభాలు 49 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, కరోనా మహమ్మారి వల్ల ముడి చమురు ధరలు, ఉత్పత్తి తగ్గిపోవడమే దీనికి కారణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో మూలధన వ్యయాన్ని తగ్గించాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. పబ్లిక్ ఇష్యూకు వచ్చిన తర్వాత రెండో వార్షిక ఫలితాలను ప్రకటించిన సంస్థ, 88.2 బిలియన్ డాలర్లుగా నమోదవ్వగా, 2020లో 44.4 శాతం తగ్గి 49 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిపింది.
అయినప్పటికీ, సంస్థ మాటిచ్చినట్టుగానే ఐదేళ్ల వరకు కంపెనీ వాటాదార్లకు ఏడాది 75 బిలియన్ డాలర్ల డివిడెండ్‌ను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ‘ఇప్పటికీ సంస్థ చమురు, గ్యాస్ పోర్ట్‌ఫోలియో దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే కొనసాగుతాయి. భవిష్యత్తులో ఆసియా ప్రాంతంలో డిమాండ్ పెరగడం, మరిన్ని చోట్ల సానుకూల సంకేతాలు ఉంటాయని ఆశిస్తున్నట్టు’ సౌదీ అరామ్‌కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమిన్ నాజర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.